దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విక్టరీ
ABN , First Publish Date - 2020-12-30T06:58:51+05:30 IST
సొంతగడ్డపై శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో ఆతిథ్య దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా..

సెంచూరియన్: సొంతగడ్డపై శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో ఆతిథ్య దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా.. ఇన్నింగ్స్-45 పరుగులతో గెలుపొంది.. సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 65/2తో నాలుగో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 115 పరుగులే జోడించి 180 వద్ద ఆలౌటైంది.
కుశాల్ పెరీర (64), హసరంగ (59) మాత్రమే పోరాడారు. డుప్లెసి (199) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక 396, సౌతాఫ్రికా 621 రన్స్ చేశాయి.