దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ వన్డే వర్షార్పణం

ABN , First Publish Date - 2020-02-08T08:41:42+05:30 IST

దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు ...

దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ వన్డే వర్షార్పణం

డర్బన్‌: దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. క్వింటన్‌ డికాక్‌ (11)ను రూట్‌ అవుట్‌ చేయగా.. బవుమా (21)ను జోర్డాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మ్యాచ్‌ నిలిపివేసేసరికి ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (35 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు.


Updated Date - 2020-02-08T08:41:42+05:30 IST