సౌరవ్ ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పుడూ లేడు..!
ABN , First Publish Date - 2020-04-01T10:06:35+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎప్పుడూ బిజీబిజీగా గడిపే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇంటిపట్టునే ఉంటున్నాడు. అయితే, గంగూలీ ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పు డూ లేడని అతడి భార్య

- గంగూలీ భార్య డోనా
కోల్కతా: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎప్పుడూ బిజీబిజీగా గడిపే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇంటిపట్టునే ఉంటున్నాడు. అయితే, గంగూలీ ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పు డూ లేడని అతడి భార్య డోనా చెప్పింది. ఈ ఖాళీ సమయంలో గంగూలీ ఇంట్లోనే జిమ్ చేస్తూ, సినిమాలు చూస్తూ గడుపుతున్నాడని తెలిపింది. కాగా, కూతురు సనా కొత్త వంటలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తోంది.