నేను ఆరోగ్యంగానే ఉన్నా

ABN , First Publish Date - 2020-06-21T08:33:04+05:30 IST

తనకు కరోనా పాజిటివ్‌ అని వచ్చిన వార్తలను బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) కార్యదర్శి స్నేహాశీష్‌ గంగూలీ ఖండించాడు. తాను పూర్తి...

నేను ఆరోగ్యంగానే ఉన్నా

కరోనా పుకార్లపై గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌


కోల్‌కతా: తనకు కరోనా పాజిటివ్‌ అని వచ్చిన వార్తలను బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) కార్యదర్శి స్నేహాశీష్‌ గంగూలీ ఖండించాడు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని మీడియాకు క్యాబ్‌ విడుదల చేసిన ప్రకటనలో స్నేహాశీష్‌ స్పష్టం చేశాడు. స్నేహాశీష్‌ భార్య, అత్త, మామతో పాటు వాళ్లింట్లో పని మనిషికి పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని పశ్చిమ బెంగాల్‌ వైద్యశాఖ అంతకుముందు ప్రకటించింది. వీరంతా ఓ ప్రయివేట్‌ దవాఖానాలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కాగా.. స్నేహాశీ్‌షకు చేసిన పరీక్షల్లో మాత్రం నెగటివ్‌ రిపోర్టు వచ్చినట్టు పేర్కొంది. 

Updated Date - 2020-06-21T08:33:04+05:30 IST