గిల్‌.. సారా.. ఓ పోస్ట్‌!

ABN , First Publish Date - 2020-08-01T08:46:38+05:30 IST

టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ డేటింగ్‌లో ఉన్నారా..? కొన్నిరోజులుగా ...

గిల్‌.. సారా..  ఓ పోస్ట్‌!

ముంబై: టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ డేటింగ్‌లో ఉన్నారా..? కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరు పోస్ట్‌ చేసే ఫొటోలు, కామెంట్లను చూసి అభిమానులు మాత్రం ఇద్దరి మధ్య ‘సంథింగ్‌ సంథింగ్‌’ ఉందంటూ గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ ఒకే తరహాలో పోస్ట్‌ చేసి మరోసారి గాసిప్‌ రాయుళ్లకు పని కల్పించారు. ముందుగా శుభ్‌మన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పెట్టి దానికి ‘ఐ స్పై’ అని కామెంట్‌ జోడించాడు. ఆ వెంటనే సారా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఐ స్పై’ అన్న కామెంట్‌తో తన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఇంకేముంది.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌లను చూసి నెటిజన్లు.. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Updated Date - 2020-08-01T08:46:38+05:30 IST