ఒంటరి పోరు చేసి ఔట్ అయిన శ్రేయాస్

ABN , First Publish Date - 2020-02-08T19:37:39+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డేల్లోకొచ్చేసరికి...

ఒంటరి పోరు చేసి ఔట్ అయిన శ్రేయాస్

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డేల్లోకొచ్చేసరికి చేతులెత్తేసింది. తొలి వన్డేలో ఓడిన టీమిండియా రెండో వన్డేలోనూ ఓటమి అంచుల్లో ఉంది. ఓపెనర్లు విఫలం కావడం, మిడిలార్డర్ కూడా ఆశించినంతగా రాణించకపోవడంతో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా దాదాపుగా చేతులెత్తేసింది. హాఫ్ సెంచరీతో రాణించి ఒంటరి పోరు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా బెన్నెట్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. అయ్యర్ 57 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా(17), శార్దూల్ ఠాకూర్(9) క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా 30 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాలంటే టీమిండియా 131 పరుగులు చేయాల్సి ఉంది.

Updated Date - 2020-02-08T19:37:39+05:30 IST