శ్రేయాస్‌.. లవ్‌లో పడ్డాడనుకున్నా!

ABN , First Publish Date - 2020-04-07T09:55:49+05:30 IST

భారత జట్టు నెంబర్‌ ఫోర్‌ బ్యాట్స్‌మన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కానీ టీనేజిలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న సమయంలో ...

శ్రేయాస్‌.. లవ్‌లో పడ్డాడనుకున్నా!

న్యూఢిల్లీ: భారత జట్టు నెంబర్‌ ఫోర్‌ బ్యాట్స్‌మన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కానీ టీనేజిలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న సమయంలో శ్రేయాస్‌ తండ్రి సంతోష్‌ అయ్యర్‌ తెగ ఆందోళన చెందాడట. ప్రేమలో పడడంతో పాటు చెడు సహవాసాలు తమ కుమారుడి దృష్టిని మరల్చాయేమోనని స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ దగ్గరికి కూడా తీసుకెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. ‘ముంబై అండర్‌-16 జట్టుకు ఆడుతున్న సమయంలో శ్రేయాస్‌ ఆట గతి తప్పింది. టాలెంట్‌ ఉన్నా కూడా ఆటపై దృష్టి పెట్టడం లేదని కోచ్‌ కూడా చెప్పాడు. అందుకే భయపడి సైకాలజి్‌స్టను సంప్రదించా. కానీ ఆందోళన అనవసరమని, అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన మాకు భరోసా ఇచ్చాడు. తర్వాత ఫామ్‌ను అందుకోవడంతో పాటు శ్రేయా్‌సకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు’ అని సంతోష్‌ అయ్యర్‌ వివరించాడు. 

Read more