టీనేజ్‌ షూటర్‌ పెద్ద మనసు

ABN , First Publish Date - 2020-05-17T10:03:20+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అథ్లెట్లకు సాయం చేసేందుకు 17 ఏళ్ల షూటర్‌ శివమ్‌ ఠాకూర్‌ ముందుకొచ్చాడు. తన సంపాదనలో 60 శాతం...

టీనేజ్‌ షూటర్‌ పెద్ద మనసు

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అథ్లెట్లకు సాయం చేసేందుకు 17 ఏళ్ల షూటర్‌ శివమ్‌ ఠాకూర్‌ ముందుకొచ్చాడు. తన సంపాదనలో 60 శాతం విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో యూత్‌ ఆసియన్‌ గేమ్స్‌కు ఎంపికైన శివమ్‌ ఏడాదిలో స్కాలర్‌షిప్స్‌, ఇతరత్రా ఆదాయాల ద్వారా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ‘వివిధ మార్గాల ద్వారా నాకు వచ్చిన ఆదాయం నుంచి 60 శాతం మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న అథ్లెట్లకు ఇవ్వాలనుకుంటున్నా’ అని శివమ్‌ తెలిపాడు.

Updated Date - 2020-05-17T10:03:20+05:30 IST