ధోనీ నిర్ణయానికి షాకయ్యా ..

ABN , First Publish Date - 2020-09-21T08:45:06+05:30 IST

డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో బోణీ చేసింది.

ధోనీ నిర్ణయానికి షాకయ్యా ..

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కానీ, సామ్‌ కర్రాన్‌ను తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు పంపి మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో కర్రాన్‌ (6 బంతుల్లో 18) ధాటిగా ఆడి చెన్నై విజయాన్ని సునాయాసం చేశాడు. కాగా, ధోనీ నిర్ణయం తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని కర్రాన్‌ చెప్పాడు. 18వ ఓవర్‌లో ధాటిగా ఆడడంతో గెలుపు సులువైందని అన్నాడు. మహీ మేధావి అని కొనియాడాడు.

Updated Date - 2020-09-21T08:45:06+05:30 IST