కోహ్లీ, నేను మంచి మిత్రులం.. కానీ..: షోయబ్ అక్తర్

ABN , First Publish Date - 2020-05-24T22:55:32+05:30 IST

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కి ఉండే క్రేజ్.. మరే ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకి ఉండదు అనడం అతిశయోక్తి కాదు. ఈ రెండు దేశల మధ్య మ్యాచ్

కోహ్లీ, నేను మంచి మిత్రులం.. కానీ..: షోయబ్ అక్తర్

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కి ఉండే క్రేజ్.. మరే ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకి ఉండదు అనడం అతిశయోక్తి కాదు.  ఈ రెండు దేశల మధ్య మ్యాచ్‌ ఉందంటే.. ప్రజలు పనులు మానుకొని టీవీలకు అతుక్కుపోతారు. అయితే భారత, పాకిస్థానీ క్రికెటర్లు మైదానంలో ఎంత పోటీ పడతారో.. మైదానం వెలుపల మంచి మిత్రుల్లా ఉంటారు. అలాగే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు మంచి మిత్రుడు అని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. సంజయ్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన లైవ్ సెషన్‌లో ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 


‘‘నేను, కోహ్లీ మంచి మిత్రులం. మేమిద్దరం పంజాబీలతో కాబట్టి మా స్వభావాలు ఒకేలా ఉంటాయి. అతను నా కంటే చాలా జూనియర్ కానీ, నేను అతన్ని గౌరవిస్తాను. కానీ, మా స్నేహం బయట మాత్రమే.. మైదానంలో మేము బద్ద శత్రువులమే’’ అని అక్తర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-24T22:55:32+05:30 IST