ఆ విషయం మర్చిపోయినట్లు ఉన్నారు.. ఐసీసీపై అక్తర్ చురకలు!

ABN , First Publish Date - 2020-12-28T13:02:31+05:30 IST

ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20 జట్టులో ఒక్క పాకిస్తాన్ ఆటగాడు కూడా లేడు. దీనిపై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఆ విషయం మర్చిపోయినట్లు ఉన్నారు.. ఐసీసీపై అక్తర్ చురకలు!

ఇస్లామాబాద్: ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20 జట్టులో ఒక్క పాకిస్తాన్ ఆటగాడు కూడా లేడు. దీనిపై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘పాకిస్తాన్ జట్టు టీ20 మ్యాచులు ఆడుతుందని ఐసీసీ మర్చిపోయినట్లు ఉంది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తమ జట్టులో కూడా ప్రతిభావంతులైన టీ20 ప్లేయర్స్ ఉన్నారని, కానీ వారెవరికీ ఐసీసీ జట్టులో చోటు లభించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అక్తర్ అన్నాడు. ‘‘ప్రపంచ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్‌ను కూడా ఐసీసీ ఎంపిక చేయలేదు. ఒక్కరంటే ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ కూడా ఆ జట్టులో లేడు’’ అని అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-12-28T13:02:31+05:30 IST