కష్టాలతో రాటుదేలా..
ABN , First Publish Date - 2020-12-01T09:38:34+05:30 IST
కుటుంబ పరిస్థితులే జీవితంలో కష్టాలను ఎదుర్కొనేలా తనను తీర్చిదిద్దాయని భారత హాకీ జట్టు యువ మిడ్‌ఫీల్డర్ షంషేర్ సింగ్ తెలిపాడు. ‘నా తండ్రి చిన్న రైతు. నేను హాకీలో ప్రవేశించిన తొలి

బెంగళూరు: కుటుంబ పరిస్థితులే జీవితంలో కష్టాలను ఎదుర్కొనేలా తనను తీర్చిదిద్దాయని భారత హాకీ జట్టు యువ మిడ్‌ఫీల్డర్ షంషేర్ సింగ్ తెలిపాడు. ‘నా తండ్రి చిన్న రైతు. నేను హాకీలో ప్రవేశించిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డా. కనీసం స్టిక్, షూస్ కూడా కొనుక్కోలేకపోయా’ అని 23 ఏళ్ల షంషేర్ వెల్లడించాడు. ‘ఈ ఏడాది కరోనాతో భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నా జీవితానుభవాలే ఈ క్లిష్ట తరుణంలో నేను నిబ్బరంగా ఉండేందుకు తోడ్పడ్డాయి. అయితే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మన లక్ష్యాన్ని వీడకపోవడం ముఖ్యం’ అని షంషేర్ అన్నాడు. జట్టు తనపై ఆధారపడే ఆటగాడి స్థాయికి చేరడమే లక్ష్యమని అతడు చెప్పాడు.