హిందూ ఆలయంలో అఫ్రిదీ సేవా కార్యక్రమాలు
ABN , First Publish Date - 2020-05-14T00:01:48+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ తనకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌లోని మారుమూత ప్రాంతాలకు

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ తనకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌లోని మారుమూత ప్రాంతాలకు వెళ్లి.. అక్కడ అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు. షాహిద్ అఫ్రిదీ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి.. కష్టాల్లో ఉన్నవారికి అందిస్తున్నారు.
తాజాగా అఫ్రిదీ ఓ హిందు ఆలయంలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులను ఆయన అందించారు. ‘‘ఈ సమయంలో మనం కలసి కట్టుగా ఉండాలి. ఐకమత్యమే మన బలం. శ్రీ లక్ష్మీనారాయణ్ మందిర్‌కి వెళ్లిన అక్కడ కష్టాల్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులను అందించాను’’ అంటూ అఫ్రిదీ ట్వీట్ చేశారు. అఫ్రిదీ చేసిన ఈ మంచి పనిపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.