యువ ఆటగాళ్లు మెరవడంపై షారూక్ సంబరం
ABN , First Publish Date - 2020-10-01T22:06:09+05:30 IST
రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించడంపై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్
దుబాయ్: రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించడంపై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. జట్టులోని యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో నెగ్గిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
కేకేఆర్ విజయం తర్వాత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, అండ్రూ రసెల్‌ను బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ కమలేశ్ నాగర్కోటిని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఐపీఎల్లో రెండో మ్యాచ్ ఆడుతున్న నాగర్కోటి కీలకమైన రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. టెండూల్కర్ ట్వీట్‌కు షారూక్ స్పందిస్తూ.. జట్టులోని యువ ఆటగాళ్లు రాణించారని సంతోషం వ్యక్తం చేశాడు.