క్రీడా అవార్డుల ఎంపిక కమిటీలో సెహ్వాగ్‌, సర్దార్‌

ABN , First Publish Date - 2020-08-01T08:44:35+05:30 IST

ఈ ఏడాది క్రీడా అవార్డుల ఎంపికకు 12 మంది సభ్యుల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

క్రీడా అవార్డుల ఎంపిక కమిటీలో సెహ్వాగ్‌, సర్దార్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది క్రీడా అవార్డుల ఎంపికకు 12 మంది సభ్యుల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన ఈ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌కు చోటు కల్పించారు. పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మాలిక్‌, టీటీ మాజీ క్రీడాకారిణి మోనాలిసా బారువా మెహతా, బాక్సర్‌ దేవరాజన్‌, క్రీడా వ్యాఖ్యాత మనీశ్‌ బతావియా, పాత్రికేయులు అలోక్‌ సిన్హా, నీరూ భాటియా కమిటీలోని ఇతర సభ్యులు. 

Updated Date - 2020-08-01T08:44:35+05:30 IST