ఆ టోర్నీల్లో టీమిండియా సెలెక్షనే తప్పు: నాసిర్ హుస్సేన్

ABN , First Publish Date - 2020-07-06T23:41:27+05:30 IST

ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ స్పందించారు.

ఆ టోర్నీల్లో టీమిండియా సెలెక్షనే తప్పు: నాసిర్ హుస్సేన్

లండన్: ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ స్పందించారు. ఈ టోర్నీల్లో భారత్ చేసే అతి ముఖ్యమైన తప్పు సెలెక్షన్ అని అతను అభిప్రాయపడ్డాడు. ‘అంతా బాగున్నప్పుడు కోహ్లీ సెంచరీ, రోహిత్ ఓ సెంచరీ కొట్టేస్తారు. అప్పుడు మిడిలార్డర్ ఆటగాళ్లకు బ్యాటింగ్ అవకాశం కూడా రాదు. అయితే భారత్ 20 పరుగులకే 3 వికెట్లు పోగొట్టుకుంటే పరిస్థితి మారిపోతుంది. ఆ స్థితిలో మిగతా మ్యాచుల్లో బ్యాటింగ్ చేయని మిడిలార్డర్ ఫెయిలయితే ఇంకేముంది. మళ్లీ టీమిండియా మరో వికెట్ కోల్పోతుంది’ అని నాసిర్ వివరించాడు.

Updated Date - 2020-07-06T23:41:27+05:30 IST