అతను ఐపీఎల్‌కొచ్చింది ఎంజాయ్‌ చేసేందుకే..

ABN , First Publish Date - 2020-12-10T09:10:09+05:30 IST

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి ఆస్వాదించడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని వీరూ ఘాటుగా విమర్శించాడు...

అతను ఐపీఎల్‌కొచ్చింది ఎంజాయ్‌ చేసేందుకే..

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి ఆస్వాదించడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని వీరూ ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్‌ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన మ్యాక్స్‌వెల్‌ (పంజాబ్‌) స్వదేశంలో భారత్‌తో వన్డే, టీ20ల్లో బ్రహ్మాండంగా రాణించాడు. దీంతో ఒత్తిడితో జాతీయ జట్టుకు బాగా ఆడుతున్న గ్లెన్‌.. ఐపీఎల్‌లో మాత్రం విఫలమవుతున్నాడని వీరూ దుయ్యబట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున మ్యాక్స్‌ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు.


Updated Date - 2020-12-10T09:10:09+05:30 IST