ఇంగ్లండ్‌ ఉత్కంఠ గెలుపు

ABN , First Publish Date - 2020-02-16T09:49:55+05:30 IST

ఆఖరి ఓవర్‌ చివరి బంతికి వరకు జరిగిన రెండో టీ-20లో ఇంగ్లండ్‌ జట్టు దక్షిణాఫ్రి కాపై విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను 1-1తో సమం...

ఇంగ్లండ్‌ ఉత్కంఠ గెలుపు

సౌతాఫ్రికాతో రెండో టీ20

డర్బన్‌:  ఆఖరి ఓవర్‌ చివరి బంతికి వరకు  జరిగిన రెండో టీ-20లో ఇంగ్లండ్‌ జట్టు దక్షిణాఫ్రి కాపై విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. బెన్‌స్టోక్స్‌ (47 నాటౌట్‌), జేసన్‌ రాయ్‌ (40), మొయిన్‌ అలీ (11 బంతుల్లో 39), బెయిర్‌స్టో (35) సత్తా చాటారు. అనంతరం సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేసింది. డికాక్‌ (65), డ్యూసెన్‌ (43 నాటౌట్‌), బవుమా (31) రాణించారు. చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో కర్రాన్‌ రెండు, మూడు బంతులను ప్రిటోరియస్‌ 6,4 బాదడంతో సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. నాలుగో బంతికి ప్రిటోరియస్‌ రెండు పరుగులు చేశాడు. కానీ ఒత్తిడిని దరిచేరనీయని కర్రాన్‌ 5,6 బంతులలో ప్రిటోరియస్‌, ఫోర్ట్యున్‌లను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. కాగా సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 6 గం.ల నుంచి (సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం) జరుగుతుంది. 

Updated Date - 2020-02-16T09:49:55+05:30 IST