టెస్టులకు గుడ్‌బై చెప్పడం బెటర్.. సర్ఫరాజ్‌కు సలహా!
ABN , First Publish Date - 2020-08-12T04:28:20+05:30 IST
పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ టెస్టుల నుంచి రిటైర్ అవడం మంచిదని మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రజా సూచించారు.

ఇస్లామాబాద్: పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ టెస్టుల నుంచి రిటైర్ అవడం మంచిదని మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రజా సూచించారు. ఒకసారి కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు సడెన్‌గా బెంచికి పరిమితం అయితే తట్టుకోవడం కష్టమని, అదే సమయంలో అలాంటి ఆటగాడు బెంచిపై ఉండటం మిగతా ప్లేయర్స్‌పై ఒత్తిడి తెస్తుందని రజా చెప్పాడు. ‘సర్ఫరాజ్ జట్టులో ఉండటం ప్రస్తుత టెస్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌పై ఒత్తిడి తెస్తుంది. ఓ మాజీ కెప్టెన్ తనను గమనిస్తున్నాడన్న భావనతోనే అతను ఆడాల్సి ఉంటుంది’ అని రజా అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యలేవీ ఉండకూడదంటే సర్ఫరాజ్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిపెట్టడం బెటరని సర్ఫరాజ్‌కు సలహా ఇచ్చాడు.