మంజ్రేకర్ మారలేదు.. ఈసారి రాయుడు, చావ్లాపై!

ABN , First Publish Date - 2020-09-20T21:48:12+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ గతేడాది ప్రపంచకప్ నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. రవీంద్ర

మంజ్రేకర్ మారలేదు.. ఈసారి రాయుడు, చావ్లాపై!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ గతేడాది ప్రపంచకప్ నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ ఆటగాడిగా అభివర్ణించి విమర్శలు పాలైన మంజ్రేకర్.. ఆ తర్వాత ‘వాయిస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’గా పిలిచే హర్షాభోగ్లే పైనా విమర్శలు కురిపించాడు. భోగ్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కానీ, లిస్ట్ ఎ మ్యాచ్‌లు కానీ ఆడలేదని విమర్శించాడు. తాజాగా మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఈసారి పీయూష్ చావ్లా, అంబటి రాయుడులను లక్ష్యంగా చేసుకున్నాడు.   


చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన వారిద్దరూ చాలా తక్కువ ప్రొఫైల్ కలిగిన ఆటగాళ్లని విమర్శించాడు. నిన్నటి మ్యాచ్‌లో వారిద్దరూ బాగా ఆడారని ప్రశంసిస్తూనే ‘లో ప్రొఫైల్’ ఆటగాళ్లని అన్నాడు. దీంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మంజ్రేకర్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రెండు ప్రపంచకప్‌లు గెలుచుకున్న భారత జట్టులో చావ్లా సభ్యుడు కాగా, రాయుడు 55 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.


ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో రాయుడు చెలరేగిపోయాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డుప్లెసిస్‌తో కలిసి 115 పరుగులు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చావ్లా నిన్నటి మ్యాచ్‌లో 4-0-21-1 స్పెల్‌తో అదరగొట్టాడు. ముంబై కెప్టెన్ రోహిత్‌ను వెనక్కి పంపి ముంబై ఇండియన్స్‌ను ఒత్తిడిలో పడేశాడు.  

Updated Date - 2020-09-20T21:48:12+05:30 IST