‘సానియా ట్రౌజర్స్’ ఫన్నీ టిక్-టాక్ వీడియో షేర్ చేసిన టెన్నీస్ స్టార్
ABN , First Publish Date - 2020-05-13T21:51:49+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచం గృహ నిర్భందంలో ఉన్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచం గృహ నిర్భందంలో ఉన్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ సమయంలో టిక్-టాక్ అందరినీ అలరిస్తోంది. ఇందులో ఉన్న ఫన్నీ వీడియోలు చాలామందికి టైమ్‌పాస్ కలిగిస్తున్నాయి.
అయితే తన పేరుతో ఉన్న ఓ ఫన్నీ టిక్-టాక్ వీడియోని టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ట్వీట్ చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందకు ఈ మధ్యకాలంలో అందరూ శానిటైజర్లు వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో ఓ వ్యక్తి దుకాణదారుడి వద్దకు వెళ్లి అతనికి ఓ చిట్టి ఇస్తాడు. అందులో శానిటైజర్‌కి బదులుగా ‘సానియా ట్రౌజర్’ అని రాసి ఉంటుంది. దీంతో ఆ దుకాణదారుడు.. మీ నాన్న ఏం చేస్తుంటాడు అని అడగ్గా.. అతను ‘ఎమ్మెల్యే’ అని చెబుతాడు. వెంటనే దుకాణదారుడు ‘అది సానియా ట్రౌజర్ కాదు.. శానిటైజర్’ అని ఆ వ్యక్తితో చెబుతాడు.
ఈ ఫన్నీ వీడియోని ఓ నెటిజన్ షేర్ చేసి.. అందులో సానియా మీర్జాని ట్యాగ్ చేశాడు.. దీన్ని రీట్వీట్ చేసిన సానియా నవ్వుతున్నట్లుగా, తల కొట్టుకుంటున్నట్లుగా ఉన్న ఎమోజీలను షేర్ చేసింది.