షోయబ్‌ను ఎప్పుడు చూస్తామో..!

ABN , First Publish Date - 2020-05-17T10:07:56+05:30 IST

కరోనా కారణంగా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా దంపతులు వేర్వేరు దేశాల్లో నివసించాల్సి వస్తోంది. సానియా తన కొడుకు ఇజాన్‌తో హైదరాబాద్‌లో ఉండగా..

షోయబ్‌ను ఎప్పుడు చూస్తామో..!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా దంపతులు వేర్వేరు దేశాల్లో నివసించాల్సి వస్తోంది. సానియా తన కొడుకు ఇజాన్‌తో హైదరాబాద్‌లో ఉండగా.. ఆమె భర్త, క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ పాకిస్థాన్‌లో ఉన్నాడు. దీంతో ఏడాది వయస్సున్న ఇజాన్‌ తండ్రి ప్రేమకు దూరమయ్యాడని సానియా తెలిపింది. ‘మేమిద్దరం చెరో దేశంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం కష్టమే. షోయబ్‌ను  ఇజాన్‌ ఎప్పుడు చూస్తాడో చెప్పలేకుండా ఉన్నాం. వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుకుంటున్నా.. అది నేరుగా కలుసుకున్న సంతోషాన్నివ్వదు. త్వరలోనే పరిస్థితులు మారాలని కోరుకుంటున్నా’ అని సానియా వ్యాఖ్యానించింది.

Updated Date - 2020-05-17T10:07:56+05:30 IST