ఖాళీ స్టేడియాల్లో ఆడేస్తా!

ABN , First Publish Date - 2020-04-18T08:15:46+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో టెన్నిస్‌ ఆడేందుకు తాను సిద్దమేనని సానియా మీర్జా తెలిపింది. ‘స్టేడియంలో ఫ్యాన్స్‌

ఖాళీ స్టేడియాల్లో ఆడేస్తా!

  • సానియా మీర్జా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో టెన్నిస్‌ ఆడేందుకు తాను సిద్దమేనని సానియా మీర్జా తెలిపింది. ‘స్టేడియంలో ఫ్యాన్స్‌ మనల్ని ఉత్సాహపర్చడాన్ని ఆస్వాదిస్తాం. దాన్ని మరొకటి భర్తీ చేయలేదు. అయితే అభిమానులు లేరని ఆడకుండా కూర్చుంటే అసలు ఆటే జరగదుకదా. దానికంటే ఆడడమే నయం. బాబుకి జన్మనిచ్చి మళ్లీ బరిలోకి దిగేందుకు నాకు రెండేళ్లు పట్టింది. కాబట్టి ప్రేక్షకుల్లేకున్నా...ఆడేందుకు వెనుకాడను’ అని సానియా చెప్పింది. ‘ఖాళీ స్టేడియాల్లో ఆడడం సంగతి అటుంచితే...అసలు టోర్నీలకోసం చేయాల్సిన ప్రయాణాలే పెద్ద సమస్య. ఎక్కడికి బయల్దేరినా 14 రోజులు ముందే చేరుకోవాలి. దీనిలోనూ చాలా రిస్క్‌ ఉంది’ అని సానియా చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-04-18T08:15:46+05:30 IST