పంత్‌కి చోటు దక్కిందని నేను ఏడుస్తూ కూర్చొలేదు..: సాహా

ABN , First Publish Date - 2020-05-18T00:38:15+05:30 IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత అతని స్థానంలో

పంత్‌కి చోటు దక్కిందని నేను ఏడుస్తూ కూర్చొలేదు..: సాహా

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత అతని స్థానంలో వృద్ధిమాన్ సాహా జట్టులోకి వచ్చాడు. చాలాకాలం అతను అదే స్థానంలో కొనసాగాడు. అయితే రిషబ్ పంత్ వెలుగులోకి వచ్చిన తర్వాత సాహాకు టీం ఇండియా టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో సాహాకి, పంత్‌కి మధ్యలో విబేధాలు నెలకొన్నాయనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలకి సాహా ఫుల్‌స్టాప్ పెట్టాడు. రిషబ్ పంత్‌కి చోటు దక్కిందని తాను ఓ మూలన కూర్చొని బాధపడలేదని సాహా పేర్కొన్నాడు. 


ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నతనం నుంచి చాలా ఆదర్శాలు ఉన్న వ్యక్తిని. నేను సరిగ్గా ఆడకుంటే బాధపడను. ఓ మూలకి కూర్చొని బాధపడను. రిషబ్ పంత్‌ ఇంగ్లండ్‌లో సెంచరీ చేసినప్పుడు అతనికి కాల్ చేసి నేను అభినందించాను. ఇంగ్లండ్‌లో స్వింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయని నేను పంత్‌తో ఎన్‌సీఏలో మాట్లాడాను. నేను అతనితో మాట్లాడటం లేదు అనేది అవాస్తవం. మేము మంచి మిత్రులం.. కలిసి ప్లేస్టేషన్‌లో గేమ్స్‌ కూడా ఆడుతాం’’ అని సాహా తెలిపాడు. 

Updated Date - 2020-05-18T00:38:15+05:30 IST