మోదీకి సచిన్, విరాట్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2020-09-18T09:12:35+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సహా మాజీ, తాజా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సహా మాజీ, తాజా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవనీయులైన ప్రధాని మోదీగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని విరాట్ ట్వీట్ చేయగా.. సచిన్ హిందీలో విషెస్ తెలిపాడు. అలాగే, తానాడే రోజుల్లో మోదీతో కలిసి దిగిన ఫొటోను సచిన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు ప్రస్తుత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ తదితరులు మోదీకి విషెస్ తెలిపారు.