వార్న్‌, సచిన్ మధ్య పిల్లి, ఎలుకలా పోరు ఉండేది: బ్రెట్‌ లీ

ABN , First Publish Date - 2020-04-28T21:52:10+05:30 IST

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని ఔట్ చేసేందుకు ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఎంత ప్రయత్నించినా.. సచిన్, వార్న్‌కి అంతే విసుగు తెప్పించేదని

వార్న్‌, సచిన్ మధ్య పిల్లి, ఎలుకలా పోరు ఉండేది: బ్రెట్‌ లీ

సిడ్నీ: టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని ఔట్ చేసేందుకు ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఎంత ప్రయత్నించినా.. సచిన్, వార్న్‌కి అంతే విసుగు తెప్పించేదని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌ లీ అన్నారు. వీరిద్దరి మధ్యపోరు.. పిల్లి, ఎలుకల మధ్య ఉన్న పోరులా ఉండేదని ఆయన పేర్కొన్నారు. వార్న్‌ బౌలింగ్‌లో అలా ఎవరూ ఆడలేకపోయేవారని తెలిపారు. వార్న్‌ బౌలింగ్‌లో ఉండే ప్రతీ మార్పును సచిన్ ముందుగానే కనిపెట్టి.. అందుకు తగిన జవాబుతో సిద్ధంగా ఉండేవారని లీ అన్నారు. 


‘‘వార్న్ బౌలింగ్‌కి వేస్తున్న సమయంలో కొన్నిసార్లు ఆయన(సచిన్) వేగంగా చేసేవాడు. దీంతో వార్న్ ఒత్తిడిలో షార్ట్ బంతులు వేసేవాడు. కొన్నిసార్లు సచిన్ బ్యాక్‌ఫుట్‌లో అద్బుతమైన షాట్స్ ఆడేవాడు. ఇది చూస్తుంటే నాకు పిల్లి, ఎలుకల మధ్య పోరులా అనిపించేది. వార్న్‌తో అలా ఆడుకున్న బ్యాట్స్‌మెన్ సచిన్ మాత్రమే. వేరే ఎవరికీ అది సాధ్యం కాదు’’ అని లీ అన్నారు. 


తనకు 22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సచిన్‌తో ఆడే అవకాశం తొలిసారి వచ్చిందని లీ తెలిపారు. ‘‘తొలిసారి సచిన్‌ని ఔట్ చేసిన తర్వాత నాకు ఇంకా చాలు అనిపించింది. సచిన్ టెండూల్కర్‌ని ఔట్ చేయడం.. నేను సాధించిన అతి పెద్ద ఘనత అని నేను భావించాను’’ అని బ్రెట్ లీ తెలిపారు.

Updated Date - 2020-04-28T21:52:10+05:30 IST