ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. ఛేదన సులువైంది!

ABN , First Publish Date - 2020-11-06T07:29:47+05:30 IST

యూఏఈలో ఉష్ణోగ్రతల వల్ల ఐపీఎల్‌ ద్వితీయార్థంలో ఛేదన సులభమైందని సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌, అబుదాబిల్లో ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్న...

ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. ఛేదన సులువైంది!

ఐపీఎల్‌పై సచిన్‌ విశ్లేషణ


ముంబై: యూఏఈలో ఉష్ణోగ్రతల వల్ల ఐపీఎల్‌ ద్వితీయార్థంలో ఛేదన సులభమైందని సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌, అబుదాబిల్లో ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్న జట్లు గెలుస్తున్న నేపథ్యంలో.. మొదటి ఐదు వారాల్లో జరిగిన మ్యాచ్‌ల సరళిని మాస్టర్‌ విశ్లేషించాడు. ‘ఆరు వారాల క్రితం లీగ్‌ ఆరంభమైంది. అప్పటితో పోల్చితే ప్రస్తుత ఉష్ణోగ్రతలు సగటున ఆరు డిగ్రీలు తగ్గాయి. నీడలను బట్టి చూస్తే.. సూర్యాస్తమయ సమయాల్లో కూడా తేడా కనిపిస్తోంది. ఇవన్నీ పిచ్‌పై ప్రభావం చూపేవే. అయితే వేడిమి తగ్గడంతో గత 7-8 రోజులుగా ఛేజింగ్‌ సులువైంద’ని సచిన్‌ చెప్పాడు. తొందరగా సూర్యాస్తమయం కావడం వల్ల బౌలర్లకు ఇప్పుడు పిచ్‌ నుంచి కొంత సహకారంలభిస్తోందన్నాడు. 

Updated Date - 2020-11-06T07:29:47+05:30 IST