సచిన్ రికార్డును కోహ్లీ కొన్నేళ్లలో దాటేస్తాడు: బ్రెట్ లీ

ABN , First Publish Date - 2020-04-25T21:08:03+05:30 IST

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సృష్టించిన 100 సెంచరీల రికార్డును టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల్లో

సచిన్ రికార్డును కోహ్లీ కొన్నేళ్లలో దాటేస్తాడు: బ్రెట్ లీ

ముంబై: టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సృష్టించిన 100 సెంచరీల రికార్డును టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల్లో దాటేస్తాడని.. ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ అన్నారు.  అంతర్జాతీయ వన్డేల్లో 49 సెంచరీలు చేసిన ఆ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఇప్పటికే సచిన్ రికార్డుకు విరాట్ చేరువలో ఉన్నారు. 248 వన్డేల్లో కోహ్లీ 43 సెంచరీ చేశాడు. ఇక టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలు చేయగా.. కోహ్లీ 27 సెంచరీలు చేశాడు. 


ఇటువంటి రికార్డులు సాధించాలంటే.. ప్రతిభ, ఫిట్‌నెస్‌తో పాటు.. మానసికంగా ఎంతో బలం ఉండాలని లీ అన్నారు. కోహ్లీ వద్ద ఈ మూడు లక్షణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 


‘‘ఒకప్పుడు సచిన్‌లో ఉన్న లక్షణాలు ఇప్పుడు కోహ్లీలో కూడా ఉన్నాయి. కానీ, సచిన్‌ని దాటి వెళ్లే సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన క్రికెట్‌కి దేవుడు. మనం ఎదురుచూడటం తప్ప ఏం చేయలేము. ఒక అరుదైన, అద్భుతమైన రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న ఫామ్‌లో కోహ్లీ ఉంటే.. మరో ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల్లో అతను ఆ రికార్డు సాధించగలడు’’ అని బ్రెట్ లీ అన్నారు.

Updated Date - 2020-04-25T21:08:03+05:30 IST