పేద చిన్నారులకు సచిన్‌ సాయం

ABN , First Publish Date - 2020-12-01T09:42:39+05:30 IST

సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తీవ్రమైన జబ్బులతో బాధపడే 100 మంది పేద చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నాడు. మహారాష్ట్ర, బెంగాల్‌, అసోం, కర్ణాటక,

పేద చిన్నారులకు సచిన్‌ సాయం

ముంబై: సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తీవ్రమైన జబ్బులతో బాధపడే 100 మంది పేద చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నాడు. మహారాష్ట్ర, బెంగాల్‌, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల కోసం సచి న్‌కు చెందిన ‘ఏకం’ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెలారంభంలో అసోంకు చెందిన ఓ ఆస్పత్రికి పీడియాట్రిక్‌ పరికరాలను కూడా సచిన్‌ అందించాడు. దీనిద్వారా ప్రతీ ఏడాది 2వేల మంది చిన్నారులు లబ్ది పొందనున్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన తెగల్లోని చిన్నారులకు కూడా పోషకాహారం, విద్యా వసతులను సచిన్‌ ఫౌండేషన్‌ అందించింది.

Updated Date - 2020-12-01T09:42:39+05:30 IST