ముగిసిన క్వారంటైన్.. జట్టులో చేరిన సీఎస్‌కే బ్యాట్స్‌మన్ రుతురాజ్

ABN , First Publish Date - 2020-09-21T21:35:27+05:30 IST

సురేశ్ రైనా స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారినపడిన కారణంగా జట్టుకు ఇన్నాళ్లూ

ముగిసిన క్వారంటైన్.. జట్టులో చేరిన సీఎస్‌కే బ్యాట్స్‌మన్ రుతురాజ్

దుబాయ్: సురేశ్ రైనా స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారినపడిన కారణంగా జట్టుకు ఇన్నాళ్లూ దూరమయ్యాడు. తాజాగా అతడికి నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ నెగటివ్ ఫలితాలు రావడంతో జట్టుతో కలిశాడు. రేపు(మంగళవారం) రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో నేటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గైక్వాడ్ ఫొటోను పోస్టు చేసిన సీఎస్‌కే.. ‘రుతురాజ్ వచ్చేశాడు’’ అంటూ ట్వీట్ చేసింది.


కరోనా కారణంగా రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉన్న 23 ఏళ్ల రుతురాజ్ ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ మిస్సయ్యాడు. అయితే, రేపటి మ్యాచ్‌లో అతడు ఆడేది, లేనిది తెలియరాలేదు. ఐపీఎల్ మెడికల్ ప్రొటోకాల్ ప్రకారం.. ఎవరైనా ఆటగాడు కరోనా బారినపడితే 14 రోజుల క్వారైంటన్ తప్పనిసరి. రెండుసార్లు వరుసగా నిర్వహించిన ఫలితాల్లో నెగటివ్ వస్తేనే తిరిగి జట్టుతో చేరాల్సి ఉంటుంది. అనంతరం శిక్షణలో చేరాలంటే కార్డియోవాస్క్యులర్, లంగ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2020-09-21T21:35:27+05:30 IST