పవర్ లిఫ్టింగ్ చేస్తూ ప్రమాదం.. రెండు మోకాళ్లూ పోగొట్టుకున్న క్రీడాకారుడు

ABN , First Publish Date - 2020-08-14T02:47:48+05:30 IST

వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్(డబ్ల్యూఆర్‌పీఎఫ్) యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో అనుకోని ప్రమాదం సంభవించింది. పవర్ లిఫ్టింగ్‌ పోటీల్లో...

పవర్ లిఫ్టింగ్ చేస్తూ ప్రమాదం.. రెండు మోకాళ్లూ పోగొట్టుకున్న క్రీడాకారుడు

మాస్కో: వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్(డబ్ల్యూఆర్‌పీఎఫ్) యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో అనుకోని ప్రమాదం సంభవించింది. పవర్ లిఫ్టింగ్‌ పోటీల్లో భాగంగా రష్యాకు చెందిన ఓ రెజ్లర్ తన రెండు మోకాళ్లనూ పోగొట్టుకున్నాడు. ఈ పోటీల్లో భాగంగా 400 కిలోల బరువును ఎత్తేందుకు అలెగ్జాండర్ సెడిక్ అనే రష్యన్ పవర్ లిఫ్టర్ ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పడంతో ఆ బరువుతో సహా వెనక్కు పడిపోయాడు. అయితే మోకాళ్లు రెండూ మడత పడడంతో అక్కడిక్కడే విరిగిపోయాయి. దీంతో అలెగ్జాండర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 6 గంటలపాటు శ్రమించి అతడికి శస్త్రచికిత్స చేశారు. ఇందులో భాగంగా విరిగిపోయిన రెండు కాళ్ల ఎముకలతో పాటు చీలిపోయిన తొడ కండరాలనూ అతికించారు. దాదాపు 2 నెలలపాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని, ఏ మాత్రం కాళ్లు కదిలించకూడదని వైద్యులు హెచ్చరించారు. ఆ తరువాత చిన్నగా నడవడం ప్రారంభించాలని సూచించారు.

Updated Date - 2020-08-14T02:47:48+05:30 IST