అభిమానులు లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్-2020.. ?

ABN , First Publish Date - 2020-05-10T23:51:59+05:30 IST

ప్రముఖ క్లే-కోర్టు టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌ను ఈ ఏడాది ఫ్యాన్స్ లేకుండా నిర్వహించమే ఒకైక మార్గమని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు బెర్నాడ్ తెలిపారు.

అభిమానులు లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్-2020.. ?

ప్యారిస్: ప్రముఖ క్లే-కోర్టు టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌ను ఈ ఏడాది ఫ్యాన్స్ లేకుండా నిర్వహించమే ఒకైక మార్గమని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు బెర్నాడ్ తెలిపారు. రోలాండ్ గారోస్‌గా పిలవబడే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను తొలుత మే 24వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకూ నిర్వహించాలని భావించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టోర్నమెంట్‌ను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు.


"అభిమానులు లేకుండా టోర్నమెంట్‌ను నిర్వహించడం వలన ఆర్థిక వ్యవస్థలో  టెలివిజన్ హక్కులు మరియు భాగస్వామ్యాలకు కొంత లాభం చేకూరే అవకాశం ఉంది.’’ అని బెర్నాడ్ అన్నారు. అయితే టోర్నమెంట్‌ను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేస్తున్నారని వచ్చి వార్తలను ఆయన ఖండించారు. వాయిదా పడిన తేదీల్లో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-10T23:51:59+05:30 IST