తన జట్టులో రోహిత్‌కి బదులు ధవన్‌ని తీసుకున్న ఆసీస్ కీపర్

ABN , First Publish Date - 2020-05-09T22:01:46+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో క్రికెట్ టోర్నమెంట్‌లు అన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు తమ కలల జట్లను ప్రకటిస్తున్నారు.

తన జట్టులో రోహిత్‌కి బదులు ధవన్‌ని తీసుకున్న ఆసీస్ కీపర్

లాక్‌డౌన్ సమయంలో క్రికెట్ టోర్నమెంట్‌లు అన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు తమ కలల జట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అలెక్స్ క్యారీ కూడా తన ఆస్ట్రేలియా, ఇండియా ఆటగాళ్లతో కలిసి ఓ జట్టును ప్రకటించాడు. 


అయితే ఈ జట్టులో ఓపెనర్‌గా తనతో పాటు టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బదులు మరో ఓపెనర్ శిఖర్ ధవన్ పేరును అతను ప్రకటించాడు. టీ-20 క్రికెట్‌లో నాలుగు శతకాలు సాధించిన రోహిత్‌కి బదులు క్యారీ తన జట్టులో ధవన్‌కి చోటు కల్పించడంతో అభిమానులు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. 


అతని జట్టులో మూడోస్థానంలో స్టీవ్ స్మిత్, నాలుగో స్థానంలో టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీలను ఎంచుకున్నాడు. తనని వికెట్ కీపర్‌గా ఎంపిక చేసిన క్యారీ.. మిడిలార్డర్‌లో రిషబ్‌ పంత్‌కు చోటు కల్పించాడు. ఆల్ రౌండర్‌లుగా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన అతను.. బౌలర్లుగా.. మిషెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశాడు. స్పిన్ బౌలింగ్‌ని ఆసీస్ బౌలర్ ఆడం జంపాకు అప్పగించాడు.

Updated Date - 2020-05-09T22:01:46+05:30 IST