ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు: రోహిత్
ABN , First Publish Date - 2020-11-21T23:38:02+05:30 IST
ఐపీఎల్‌లో గాయపడిన ముంబై ఇండియన్స్ సారథి, స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ ప్లే ఆఫ్స్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో గాయపడిన ముంబై ఇండియన్స్ సారథి, స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ ప్లే ఆఫ్స్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీమిండియా వన్డే, టీ20 జట్టులో రోహిత్‌కు చోటు లభించలేదు. అయితే, గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన రోహిత్.. ఆ తర్వాతి మ్యాచుల్లో బరిలోకి దిగడంతో విమర్శలు మొదలయ్యాయి. రోహిత్‌కు దేశం కంటే ఐపీఎల్ ఎక్కువైందన్న విమర్శలు వినిపించాయి. తనపై వస్తున్న విమర్శలపై ఇప్పటి వరకు పెదవి విప్పని రోహిత్.. తాజాగా స్పందించాడు.
తన గాయం మరీ పెద్దదేమీ కాదని, ఆసీస్ టూర్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ‘‘నిజంగా ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే అందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే నేను మాత్రం నిత్యం బీసీసీఐ, ముంబై ఇండియన్స్‌తో మాట్లాడుతూనే ఉన్నా’’ అని పేర్కొన్నాడు.
తనకు అయిన గాయం చిన్నదేనని చెప్పాడు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని, వాటిని తాను పట్టించుకోబోనని స్పష్టం చేశాడు. విమర్శలకు తావివ్వకూడదనే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్నట్టు చెప్పాడు. టెస్టు సిరీస్‌కు ముందు మరింత ఫిట్‌నెస్ సాధించడంతోపాటు, మనసును ప్రశాంతంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.