బంగ్లాలో మాకు మద్దతు లభించదు

ABN , First Publish Date - 2020-05-17T10:05:54+05:30 IST

ప్రపంచంలోని ఏ స్టేడియంలో ఆడినా టీమిండియాకు అభిమానుల కొరత ఉండదు. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదని...

బంగ్లాలో మాకు మద్దతు లభించదు

న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ స్టేడియంలో ఆడినా టీమిండియాకు అభిమానుల కొరత ఉండదు. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదని స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. ‘మేం ఏ దేశంలో ఆడినా విపరీతమైన మద్దతు లభిస్తుంటుంది. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రమే మాకు ఎలాంటి సపోర్ట్‌ ఉండదు. ఇప్పుడు మీ టీమ్‌ కూడా చాలా మారిపోయింది. 2019 వరల్డ్‌క్‌పలో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది’ అని బంగ్లా ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌తో ఫేస్‌బుక్‌ లైవ్‌చాట్‌ సందర్భంగా రోహిత్‌ చెప్పాడు. 

Updated Date - 2020-05-17T10:05:54+05:30 IST