రోహిత్ ఫిట్టే కానీ..
ABN , First Publish Date - 2020-12-13T10:10:45+05:30 IST
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వైద్యపరంగా రోహిత్ ఫుల్ ఫిట్‌నె్‌సతో ఉన్నాడని.. అయితే, చివరి రెండు టెస్ట్‌ల్లో ఆడేందుకు మ్యాచ్ ఫిట్‌నెస్ విషయమై భారత జట్టు వైద్య బృందం మరోసారి పరీక్షించి నిర్ణయం తీసుకోనుందని బోర్డు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వైద్యపరంగా రోహిత్ ఫుల్ ఫిట్‌నె్‌సతో ఉన్నాడని.. అయితే, చివరి రెండు టెస్ట్‌ల్లో ఆడేందుకు మ్యాచ్ ఫిట్‌నెస్ విషయమై భారత జట్టు వైద్య బృందం మరోసారి పరీక్షించి నిర్ణయం తీసుకోనుందని బోర్డు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సోమవారం అతడు ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఈనెల 17న మొదలవనుంది. ఆసీస్‌కు వెళ్లిన తర్వాత రోహిత్ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ‘రెండు వారాల క్వారంటైన్‌లో హిట్‌మ్యాన్ అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించాం. ఆ తర్వాత టీమిండియా మెడికల్ టీమ్ అతడి ఫిట్‌నె్‌సను మరోసారి పరీక్షించి.. టెస్ట్ సిరీ్‌సలో బరిలోకి దించే విషయమై తుది నిర్ణయం తీసుకోనుంది’ అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్ పాసైన సంగతి తెలిసిందే.