రోహిత్‌.. నా ఆరాధ్య క్రికెటర్‌

ABN , First Publish Date - 2020-04-01T10:04:27+05:30 IST

భారత డాషింగ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన ఆరాధ్య క్రికెటర్‌ అని పాక్‌ యువ బ్యాట్స్‌మన్‌ హైదర్‌ అలీ చెప్పాడు. అండర్‌-19 వరల్డ్‌క్‌పతో పాటు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో పెషావర్‌ జట్టు తరఫున సంచలనాత్మక ప్రదర్శనతో ఆకట్టుకున్న

రోహిత్‌.. నా ఆరాధ్య క్రికెటర్‌

కరాచీ: భారత డాషింగ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన ఆరాధ్య క్రికెటర్‌ అని పాక్‌ యువ బ్యాట్స్‌మన్‌ హైదర్‌ అలీ చెప్పాడు. అండర్‌-19 వరల్డ్‌క్‌పతో పాటు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో పెషావర్‌ జట్టు తరఫున సంచలనాత్మక ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ టీనేజర్‌ను అభిమానులు సోషల్‌ మీడియాలో బాబర్‌ ఆజమ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ..వీరిలో మీ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరని అడగగా హైదర్‌ ఠక్కున రోహిత్‌ పేరు చెప్పాడు. రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తాడు. అతడి స్ట్రయిక్‌ రేట్‌ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. రోహిత్‌లా ఆడడానికి ప్రయత్నిస్తా’ అని హైదర్‌ తెలిపాడు.

Updated Date - 2020-04-01T10:04:27+05:30 IST