రాబిన్‌ సింగ్‌ కారు సీజ్‌

ABN , First Publish Date - 2020-06-26T08:36:47+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించడంతో మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌ కారును చెన్నై పోలీసులు సీజ్‌ చేశారు. అతని వద్ద ఎటువంటి...

రాబిన్‌ సింగ్‌ కారు సీజ్‌

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన

చెన్నై: లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించడంతో మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌ కారును చెన్నై పోలీసులు సీజ్‌ చేశారు. అతని వద్ద ఎటువంటి ఈ-పాస్‌ లేకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్‌ అధికారులు తెలిపారు. పౌరులకు తమ ఇంటి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోనే వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహా రోడ్లపై వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. 

Updated Date - 2020-06-26T08:36:47+05:30 IST