మెరిసిన ఎల్గర్‌, మార్‌క్రమ్‌

ABN , First Publish Date - 2020-12-28T09:47:17+05:30 IST

శ్రీలంకతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా దీటుగా బదులిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట చివరికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది...

మెరిసిన ఎల్గర్‌, మార్‌క్రమ్‌

సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ 317/4 

సెంచూరియన్‌: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా దీటుగా బదులిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో   రెండో రోజు ఆట చివరికి  4 వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (95) ఐదు పరుగులతో సెంచరీ  మిస్సయ్యాడు. మరో ఓపెనర్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ (68), ఫా డుప్లెసి (55 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 340/6తో ఆదివారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక మరో 56 పరుగులు జోడించి 396 వద్ద ఆలౌటైంది. దసున్‌ షనక (66 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించాడు. లూథో సిపమ్లా 4, వియాన్‌ ముల్డర్‌ 3 వికెట్లు తీశారు. 

Updated Date - 2020-12-28T09:47:17+05:30 IST