ఐపీఎల్లో రిషభ్ పంత్ అరుదైన ఘనత
ABN , First Publish Date - 2020-10-25T02:18:56+05:30 IST
ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో 33 బంతులు ఆడిన పంత్ 2 ఫోర్లు

అబుదాబి: ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో 33 బంతులు ఆడిన పంత్ 2 ఫోర్లు, సిక్సర్‌తో 27 పరుగులు సాధించాడు. ఈ సిక్సర్‌తో పంత్ ఖాతాలో 100 సిక్సర్లు చేరాయి. ఫలితంగా ఐపీఎల్లో 100 సిక్సర్లు కొట్టిన 14వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు.
ధోనీ ఇప్పటి వరకు 216 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, సంజు శాంసన్, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇక, ఓవరాల్‌గా క్రిస్ గేల్ 336 సిక్సర్లతో అందరికంటే ముందున్నాడు.