నా బయోపిక్‌లో అనుష్క నటిస్తే.. నేనే హీరోగా చేస్తా: విరాట్
ABN , First Publish Date - 2020-05-18T22:51:52+05:30 IST
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో అతను ఒకడు. క్రికెట్‌లో ఇప్పటికే

న్యూఢిల్లీ: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో అతను ఒకడు. క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన కోహ్లీ.. ఇక సినిమా రంగంపై కూడా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది.
టీం ఇండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రీతో విరాట్ లైవ్ ఛాట్‌లో పాల్గొన్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ప్రస్తావన వచ్చింది. అయితే తన బయోపిక్‌లో తన భార్య అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తే.. తానే హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని విరాట్ అన్నాడు. ‘‘రేపు ఒకవేళ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై బయోపిక్ వస్తే..అందులో విరాట్ కోహ్లీలా నువ్వే నటిస్తావా’’ అని ఛేత్రీ కోహ్లీని ప్రశ్నించాడు. ‘‘అనుష్క ఉంటే నేనూ కచ్చితంగా నటిస్తాను. కానీ, నాకు నటన వచ్చు అనే మాట అవాస్తవం. నాకు ఫుట్‌బాల్ ఆడటం కూడా వచ్చు.. మరి నాకు ఐఎస్‌ఎల్‌లో ఆడేందుకు మీరు అనుమతి ఇస్తారా? కానీ, నా పాత్రలో నా కంటే బాగా ఎవరు నటించలేరని నా అంచనా. ఒకవేళ అలా ఎవరైనా నటిస్తే.. నేను పనికిరాని వాడిని అవుతాను’’ అని కోహ్లీ సరదాగా తెలిపాడు.