కొవిడ్‌ హీరోలకు ఆర్‌సీబీ నివాళి

ABN , First Publish Date - 2020-09-18T09:13:40+05:30 IST

డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది..కొవిడ్‌పై పోరులో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారు.

కొవిడ్‌ హీరోలకు ఆర్‌సీబీ నివాళి

దుబాయ్‌: డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది..కొవిడ్‌పై పోరులో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారు. వారిలో కొందరు మృత్యువాత కూడా పడ్డారు. వారికి ఘనమైన నివాళి అర్పించాలని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణయించింది. అందులో భాగంగా ఐపీఎల్‌ టోర్నీ ఆసాంతం ‘మై కొవిడ్‌ హీరోస్‌’ అని రాసి ఉన్న జెర్సీలను ఆ జట్టు ధరించనుంది. ఆ జెర్సీలను గురువారంనాడు వర్చువల్‌ విధానంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌సీబీ చైర్మన్‌ సంజీవ్‌ చూరీవాలా, కెప్టెన్‌ కోహ్లీ పాల్గొన్నారు. అంతేకాదు.. ఆర్‌సీబీ తొలి మ్యాచ్‌లో ధరించిన ఆ జెర్సీలను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని గివ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనుంది.

Updated Date - 2020-09-18T09:13:40+05:30 IST