రాయుడు, బ్రావో ఫిట్
ABN , First Publish Date - 2020-09-30T09:34:36+05:30 IST
గాయాలతో ఇబ్బందిపడుతున్న అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో మ్యాచ్ ఫిట్నెస్ సాధించారని చెన్నై సూపర్‌కింగ్స్....
దుబాయ్: గాయాలతో ఇబ్బందిపడుతున్న అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో మ్యాచ్ ఫిట్నెస్ సాధించారని చెన్నై సూపర్‌కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. ‘రాయుడు మోకాలి నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. నెట్స్‌లో ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. వచ్చే మ్యాచ్‌లో అతను ఆడతాడు. అలాగే బ్రావో కూడా నెట్స్‌లో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని చెప్పాడు.