యూఏఈ చేరిన రవిశాస్త్రి బృందం

ABN , First Publish Date - 2020-10-27T09:21:48+05:30 IST

భారత జట్టు వచ్చేనెలలో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌

యూఏఈ చేరిన రవిశాస్త్రి బృందం

దుబాయ్‌: భారత జట్టు వచ్చేనెలలో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ ఆదివారం ఇక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే వారంతా బయో బబుల్‌లో అడుగుపెట్టారు. ఆటగాళ్లు పుజార, విహారితో పాటు కోచింగ్‌ సిబ్బంది కోసం ప్రత్యేకంగా బయో బబుల్‌ను ఏర్పాటు చేశాం. ఆరురోజుల ఐసొలేషన్‌ ముగిసిన వెంటనే పుజార, విహారి ఐసీసీ అకాడమీలో సాధన మొదలుపెడతారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. 

Updated Date - 2020-10-27T09:21:48+05:30 IST