జడేజా క్యాచ్‌ అద్భుతః

ABN , First Publish Date - 2020-03-02T10:15:33+05:30 IST

రవీంద్ర జడేజా బౌలింగ్‌, బ్యాటింగే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడతాడనే విష యం అభిమానులకు తెలిసిందే. అయితే రెండో రోజు ఆటలో జడ్డూ అసాధారణ ఫీట్‌ తో

జడేజా క్యాచ్‌ అద్భుతః

రవీంద్ర జడేజా బౌలింగ్‌, బ్యాటింగే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడతాడనే విష యం అభిమానులకు తెలిసిందే. అయితే రెండో రోజు ఆటలో జడ్డూ అసాధారణ ఫీట్‌ తో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశా డు. క్రీజులో జేమిసన్‌, వాగ్నర్‌ జోడీ భారత్‌కు చుక్కలు చూపిస్తూ తొమ్మిదో వికెట్‌కు భారీగా పరుగులు రాబడుతోంది. అయితే షమి వేసిన ఇన్నింగ్స్‌ 72వ ఓవర్‌లో ఈ జోడీని విడదీసేందుకు ఓ క్లిష్టమైన అవకాశం వచ్చింది. ఆ ఓవర్‌ చివరి బంతిని వాగ్నర్‌ స్క్వేర్‌ లెగ్‌వైపు భారీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన ఆ బంతి వేగం చూస్తే ఫోర్‌ పక్కా అనిపించింది. కెమెరా కూడా వేగం గా అటువైపే సాగింది. కానీ ఎవరూ ఊహించని విధంగా మధ్యలోనే జడేజా అమాంతం గాల్లోకి ఎగిరి తన ఎడమ చేతిని పైకి లేపి మరీ బంతిని అందుకున్నాడు. ఒక్కక్షణం జరిగిందేమిటో ఎవరికీ అర్థం కాలేదు. అటు వాగ్నర్‌ షాక్‌లో ఉండిపోగా జడేజాను సహచరులు అభినందిస్తూ కనిపించారు. ఈ క్యాచ్‌ పడతానని తాను సైతం ఊహించలేదని జడ్డూ అంగీకరించగా అటు సోషల్‌ మీడియాలో ఈ క్లిప్‌ తెగ వైరల్‌ అయిపోయింది. ‘జడేజా ఎయిర్‌లైన్స్‌.. చాలా ఎత్తుగా వెళుతుంది’ అని కైఫ్‌ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-03-02T10:15:33+05:30 IST