మాజీ క్రికెటర్‌ కస్తూరీ రంగన్‌ మృతి

ABN , First Publish Date - 2020-08-20T09:53:59+05:30 IST

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ గోపాలస్వామి కస్తూరీ రంగన్‌ గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. 1948 నుంచి 1963 వరకు మైసూర్‌, ...

మాజీ క్రికెటర్‌ కస్తూరీ రంగన్‌ మృతి

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ రంజీ క్రికెటర్‌  గోపాలస్వామి కస్తూరీ రంగన్‌ గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. 1948 నుంచి 1963 వరకు మైసూర్‌, కర్ణాటక రంజీ జట్లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కర్ణాటక క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యూరేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా ఆయన సేవలందించారు. కస్తూరీ రంగన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ట్వీట్‌ చేశాడు. 

Read more