ఆ ఇద్దరు సీనియర్లు రిటైరైతే మంచిది
ABN , First Publish Date - 2020-04-08T09:06:55+05:30 IST
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్లు షోయబ్ మాలిక్ (38), మహ్మద్ హఫీజ్ (39) ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. ఈ ఇరువురు గౌరవప్రదంగా ఆట నుంచి తప్పుకోవాలని అన్నాడు.

కరాచీ: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్లు షోయబ్ మాలిక్ (38), మహ్మద్ హఫీజ్ (39) ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. ఈ ఇరువురు గౌరవప్రదంగా ఆట నుంచి తప్పుకోవాలని అన్నాడు. ‘షోయబ్, హఫీజ్ పాక్ జట్టుకు గొప్ప విజయాలు అందించారు. ఇందులో ఎలాంటి సందేహాలూ లేవు. అయితే, జట్టు నుంచి వారు తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి దారి ఇవ్వాలి’ అని రమీజ్ అన్నాడు.