జడేజాకు రాజస్థాన్ థ్యాంక్స్
ABN , First Publish Date - 2020-10-31T10:17:07+05:30 IST
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రశంసల వర్షం కురిపించింది.

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రశంసల వర్షం కురిపించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆఖరి బంతికి సిక్సర్‌తో సీఎ్‌సకేను గెలిపించగా.. అటు రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు కూడా మెరుగయ్యాయి. దీంతో ఒకప్పటి రాజస్థాన్ ఆటగాడైన జడేజాను ట్విటర్‌లో కొనియాడింది. ‘ఒకప్పుడు రాయల్‌గా ఉన్నవాడు.. ఎప్పటికీ రాయలే’ అంటూ జడ్డూ ఆర్‌ఆర్ జెర్సీ ధరించిన ఫొటోతో ట్వీట్ చేసింది.