రైనా మళ్లీ వస్తాడు.. దీప్‌దాస్ గుప్తా

ABN , First Publish Date - 2020-09-07T00:05:58+05:30 IST

వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తిరిగి జట్టులోకి వచ్చి ఆడతాడని టీమిండియా మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా

రైనా మళ్లీ వస్తాడు.. దీప్‌దాస్ గుప్తా

న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తిరిగి జట్టులోకి వచ్చి ఆడతాడని టీమిండియా మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా పేర్కొన్నాడు. తొలుత కొన్ని మ్యాచ్‌లు ఆడడేమో కానీ, ఆ తర్వాత మ్యాచుల్లో అతడు తప్పకుండా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు నుంచి తొలుత సురేశ్ రైనా నిష్కృమించగా, ఆ తర్వాత హర్భజన్ సింగ్ కూడా తప్పుకున్నాడు.


ఈ నేపథ్యంలో వారి స్థానాల భర్తీపై దీప్‌దాస్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో రైనా మళ్లీ ఆడతాడన్న నమ్మకం తనకుందని పేర్కొన్నాడు. అయితే, ప్రారంభంలో మాత్రం కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని అన్నాడు. అంతేకాదు, అతడి స్థానాన్ని సీఎస్‌కే భర్తీ చేయకపోయినా ఆశ్చర్యపోనన్నాడు. ఇక, హర్భజన్ సింగ్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనాను తీసుకుంటే సరిపోతుందని, దేశవాళీ క్రికెట్‌లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. హర్భజన్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలడని దీప్‌దాస్ ధీమా వ్యక్తం చేశాడు. 


Updated Date - 2020-09-07T00:05:58+05:30 IST