రూ. 52 లక్షల విరాళమిచ్చిన సురేశ్ రైనా

ABN , First Publish Date - 2020-03-29T00:32:30+05:30 IST

కోవిడ్-19పై జరుగుతున్న పోరులో టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా కూడా కలిశాడు. తన వంతు సాయంగా రూ. 52

రూ. 52 లక్షల విరాళమిచ్చిన సురేశ్ రైనా

చెన్నై: కోవిడ్-19పై జరుగుతున్న పోరులో టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా కూడా కలిశాడు. తన వంతు సాయంగా రూ. 52 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తం విరాళంలో రూ. 31 లక్షలు ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్)కు, రూ. 21 లక్షలు ఉత్తరప్రదేశ్ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ప్రతి ఒక్కరు తమ శక్తిమేర సాయం చేయాలని కోరాడు. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుతూ ట్వీట్ చేశాడు. 


ఇటీవల రైనా ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. అందులో.. ‘నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. మరి మీరు? వారిని (కుటుంబాన్ని) కాపాడుకునేందుకు ఇంట్లోనే ఉంటాను. మరి మీరు?’’ అని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.  


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడైన రైనా.. ఈ నెల మొదట్లో ధోనీ, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా తదితరులతో కలిసి ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాడు. అయితే, కోవిడ్-19 కారణంగా ఆ తర్వాత క్యాంపును నిలిపివేశారు. మరోవైపు, ఐపీఎల్ సహా టోక్యో ఒలింపిక్స్ కూడా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. 

Updated Date - 2020-03-29T00:32:30+05:30 IST